AP: అధికారులపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫొటో చాలా చిన్నగా ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ఈ రకంగా వ్యవహరించడం చాలా బాధాకరమని అన్నారు. ఇకపై ఇలా జరగకుండా చూడాలని సూచించారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.