KRNL: మంత్రాలయం మండలం మాధవరం TDP కార్యాలయంలో ఇవాళ సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రాలయం TDP ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి 4 మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు మొత్తం రూ. 28,76,658 విలువైన చెక్కులను అందజేశారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అనారోగ్య సమయంలో CM సహాయ నిధి పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తుందన్నారు.