ATP: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన వివిధ స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, విద్యా, వైద్య, పనులు సహా ఏడు స్థాయి సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఆయా శాఖల అధికారులు ప్రగతి నివేదికలు సమర్పించగా, సభ్యులు తమ నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని గిరిజమ్మ ఆదేశించారు.