క్రెడిట్ కార్డ్(Credit card) వాడేవారికి అలర్ట్. చాలా మంది క్రెడిట్ కార్డులను విపరీతంగా ఉపయోగిస్తుంటారు. ఆ క్రెడిట్ కార్డులను వాడటం ద్వారా అనేక ఆఫర్ల(Offers)ను వారు సొంతం చేసుకుంటూ ఉంటారు. వాటి ద్వారా షాపింగ్(Shopping) చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్లు(Cash back Offers) కూడా వస్తుంటాయి. అయితే క్రెడిట్ కార్డుపై ఏదైనా కొనుగోలు చేసినట్లైతే వచ్చే క్యాష్ బ్యాక్‌పై సర్కారు జీఎస్టీ విధించేందుకు సిద్ధమైంది.
క్యాష్ బ్యాక్ ఆఫర్(Cash back Offers) అనేది మార్కెటింగ్ బ్రాండింగ్ సర్వీస్ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనివల్ల క్యాష్ బ్యాక్‌లో తక్కువగానే డబ్బు వస్తుంది. క్యాష్ బ్యాక్ సిస్టమ్ కూడా ఇకపై జీఎస్టీ(GST) పరిధికి సంబంధించినదిగా మారనుంది. క్యాష్ బ్యాక్‌ను ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయంగా ఇన్కమ్ ట్యాక్స్(Income Tax) పరిగణిస్తోంది.
ఏడాదిలోని ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేల కంటే ఎక్కువ క్యాష్ బ్యాక్(Cash back Offers) పై 10 శాతం టీడీఎస్(TDS)ను ప్రభుత్వం కట్ చేస్తోంది. జీఎస్టీ(GST) విధించడం వల్ల క్రెడిట్ కార్డు యూజర్ల(Credit card Users) కు వచ్చే క్యాష్ బ్యాక్‌లో కూడా ఇకపై తక్కువ డబ్బే రానుంది. దీంతో క్రెడిట్ కార్డులు ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు.