ATP: బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో వృత్తి విద్యపై ప్రధానోపాధ్యాయులు, శిక్షకులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సమగ్ర శిక్ష ఏపీసీ టి.శైలజ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే నైపుణ్యం సాధించడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. తరగతి గది బోధనతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని సూచించారు.