KNR: జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే LPG గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎలాంటి కొరత లేదని ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని పేర్కొన్నారు. యధావిధిగా సరఫరా జరుగుతూనే ఉందని తెలిపారు.