AKP: అచ్యుతాపురం మండలం హరిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 14 సంవత్సరాలు నిండిన బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలికలు భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ ముప్పు నుంచి రక్షణ పొందేందుకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.