SRPT: సూర్యాపేట పట్టణంలోని పీఎస్ఆర్ సెంటర్లో అక్రమంగా నిల్వ ఉంచిన 41 గ్యాస్ సిలిండర్లను పోలీసులు సీజ్ చేశారు. ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ.. కృత్రిమ కొరత సృష్టించినా, నల్లబజారులో విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని, ఏజెన్సీలు నిబంధనల ప్రకారం సరఫరా చేయాలని సూచించారు.