తెలంగాణ(Telangana) బీజేపీ(BJP) అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్(Bandi Sanjay)ను తప్పించడంతో ఓ అభిమాని తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం(Suicide) చేశాడు. ఖమ్మం జిల్లాకు చెందిన ఆ వ్యక్తి చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఖమ్మం బీజేపీ టౌన్ ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్(Gajjala Srinivas) ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపుతోంది.
బండి సంజయ్(Bandi Sanjay)ను బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడాన్ని తట్టుకోలేకే తాను ఈ అఘాయిత్యానికి(Suicide) పాల్పడుతున్నట్లు ఆ వ్యక్తి వెల్లడించాడు. ప్రస్తుతం అతడ్ని తమ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాాచారం.
‘‘అన్నా ఇక సెలవు.. సంజయన్నను అధ్యక్ష పదవి నుండి తొలగించడం తట్టుకోలేకపోతున్నా’’ అంటూ తన సహచరులకు, పార్టీ నేతలకు ఫోన్లు చేసిన గజ్జెల శ్రీనివాస్(Gajjala Srinivas) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని జిల్లా నేతలు స్పష్టం చేశారు. బీజేపీ(BJP) అధిష్టానం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ నెట్టింట లక్షలాది మంది బీజేపీని నిలదీస్తున్నారు. మొత్తంగా బండి సంజయ్(Bandi Sanjay) అభిమానులు నిరాశలో మునిగిపోయారు.