ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్ జే దొర కన్నుమూశారు. ఆయన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో 1943లో జన్మించారు. 1965లో IPSలో చేరారు. హైదరాబాద్‌లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేశారు. 1996 నవంబర్‌లో ఏపీ డీజీపీగా నియమితులై.. ఫిబ్రవరి 2002 వరకు ఐదేళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగారు.