TG: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి కొత్త రైలు నడపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కోరారు. పార్లమెంటు భవనంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి కేంద్రమంత్రిని కలిశారు. ఈ కొత్త రైలును సిర్పూర్ కాగజ్ నగర్, నాగపూర్ మీదుగా హౌరా వరకు నడపాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.