TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ రాశారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని గోదావరి నది తీర ప్రాంతాల్లో ఉన్న ఘాట్ ల వద్ద సమగ్ర ఏర్పాటు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా కందకుర్తి, పోచంపాడు, తడపాకల్, వాల్గొండ వంటి ప్రధాన ఘాట్ ల వద్ద భారీగా భక్తుల రద్దీ ఉంటుందని పేర్కొన్నారు.