NRML: జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ (బెటాలియన్) సంజయ్ కుమార్ జైన్‌ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని అటవీ శాఖ వసతి గృహంలో జరిగిన ఈ భేటీలో ఆయనకు పూల మొక్కను బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ సాయికిరణ్, డీఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, తదితరులు పాల్గొన్నారు.