AP: చీడికాడ బీసీ హాస్టల్లో ఆహార కొరత విషయం తెలిసి కలత చెందినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. సమస్య ఎదుర్కొంటున్న అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. పోషకాహారంతో కూడిన నాణ్యమైన ఆహారం సరిపడా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే, ఈ సమస్యను బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లారు.