ఆరేళ్ల విరామం తర్వాత ఉత్తర కొరియా ప్యాసింజర్ రైలు తొలిసారిగా చైనా రాజధాని బీజింగ్ చేరుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఈ సేవలు తిరిగి ప్రారంభం కావడంతో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగుపడనున్నాయి. బీజింగ్, ప్యోంగ్యాంగ్ మధ్య వారానికి నాలుగు సార్లు ఈ రైలు నడుస్తుందని అధికారులు తెలిపారు. ఇది సరిహద్దు ప్రయాణాల్లో కీలక మార్పుగా అభివర్ణించారు.