VKB: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ అన్నారు. కుల్కచర్ల మండలంలోని ఏకశిలా పర్వత శ్రీపాంబండ రామలింగేశ్వర స్వామిని ఆయన ఇవాళ దర్శించుకున్నారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు దైవదర్శనం ఉపశమనాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ మహిపాల్ రెడ్డి, అర్చకులు, పోలీసులు పాల్గొన్నారు.