గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ (Atiq Ahmed) నుంచి జప్తు చేసిన భూమిని యూపీ సీఎం యోగీ (CM Yogi) ఆధిత్య నాథ్ పేదలకు పంచారు. ప్రయాగ్ రాజ్‌లో సీఎం యోగీ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (Awas Yojana) కింద పేదలకు ఇంటి తాళాలు అందించారు. ఈ నెల ప్రారంభంలో లాటరీ ద్వారా లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారు. స్వయంగా ముఖ్యమంత్రి యోగి, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య ప్లాట్లను పరిశీలించి లబ్ధిదారులు, అక్కడ ఉన్న పిల్లలతో ముచ్చటించారు. అతిక్ అహ్మద్ నుంచి జప్తు చేసిన భూమిలో పేదల కోసం నిర్మించిన 76 ఫ్లాట్లకు తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రయాగ్ రాజ్(Prayag Raj) నగరంలో 226 అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. 2017కి ముందు పేదలు, వ్యాపారులు ప్రభుత్వ భూములను మాఫియా ఆక్రమించేది. కానీ ఇప్పుడలా కాదు.. కబ్జా చేసిన భూముల్లో పేదలను సంతోషంగా నివసించబోతున్నారు. పేదల సొంతింటి కల సాకారమవుతోంది.
మాఫియా నుంచి విముక్తి పొందిన భూమిలో హౌసింగ్ యూనిట్లు (Housing units) నిర్మితమై పేదలకు ఆవాసంగా మారిందన్నారు. మాఫియ నుంచి విముక్తి పొందిన భూమిలో ఇప్పుడు నిర్మించిన గృహాలు ప్రజల్లో ఆనందాన్ని నింపుతోంది అన్నారు.కాగా గ్యాంగ్ స్టర్లపై ఉక్కుపాదం మోపిని యోగీ సర్కారు గ్యాంగ్ స్టర్ అతీక్ ప్రయాగ్ రాజ్ లోని లుకర్ గంజ్ లో కబ్జా చేసిన భూముల్ని స్వాధీనం చేసుకుంది. అతీక్ అహ్మద్ బ్రతికున్నప్పుడే జప్తు చేసిన 1,731 చదరపు మీటర్ల స్థలంలో గృహ నిర్మాణ ప్రాజెక్టును చేపట్టింది. దాంట్లో 2021 డిసెంబర్ 26న సీఎం యోగి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును పీఎంఏవై (PMAY) కింద జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (DUDA)చేపట్టింది. రెండు బ్లాకులలో 76 ప్లాట్లను నిర్మించారు. 41 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు బెడ్ రూములు, వంటగది, టాయిలెట్ సౌకర్యాలతో ఫ్లాట్ ను నిర్మించారు. ఒక్కో ఫ్లాట్ రూ.3.5 లక్షకే ప్రభుత్వం అందించింది.కాగా జప్తు చేసిన భూమిలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన నిరుపేదలకు జూన్ 9న 76 ప్లాట్లను కేటాయించింది ప్రభుత్వం.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath hands over keys to 76 flats built for the poor, on land confiscated from slain gangster-turned-politician Atiq Ahmed, in Prayagraj.
The CM also inaugurated 226 development projects in the city, on the occasion. pic.twitter.com/o4F9MX2AD6