»Union Minister G Kishan Reddy To Give Keynote Address At Unwto New York On Global Tourism Development
Kishan Reddy: కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం.. ఐరాసలో ప్రసంగించనున్న మొదటి పర్యాటక మంత్రి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. వచ్చే నెల 10 నుంచి 14 వరకు న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ (హెచ్‌ఎల్‌పిఎఫ్)లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, కార్యనిర్వాహక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రసంగించనున్నారు.
Kishan Reddy: భారత కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ (హెచ్ఎల్పీఎఫ్)లో కిషన్ రెడ్డి ప్రసంగించనున్నారు. 2023 జులై 10 నుంచి 14 వరకు జరిగే కార్యక్రమంలో మాట్లాడేందుకు జి కిషన్ రెడ్డికి ఆహ్వానం అందింది. న్యూయార్క్‌లోని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) ఆయనకు ఆహ్వానం పంపింది. ఈ ఆహ్వానం అందుకున్న మొదటి భారతీయ పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి మాత్రమే.
ఐక్యరాజ్యసమితి HLPF థీమ్ “కరోనావైరస్ వ్యాధి (COVID-19) నుండి కోలుకోవడం, అన్ని స్థాయిలలో స్థిరమైన అభివృద్ధి కోసం 2030 ఎజెండాను పూర్తిగా అమలు చేయడం”. జూలై 13, 14 తేదీల్లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రసంగించనున్నారు. ఈ ఏడాది జూన్ 21, 22 తేదీల్లో గోవాలో జరిగిన జీ 20 పర్యాటక మంత్రుల సమావేశం అనంతరం ఈ ఆహ్వానం అందడం విశేషం. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం, దేశాలు, వాటాదారుల మధ్య భాగస్వామ్యం, సహకారాల పెంపుకు జీ 20 టూరిజం వర్కింగ్ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది. ‘ఇండియా డిక్లరేషన్’, ‘గోవా రోడ్ మ్యాప్’ అమలు G-20 టూరిజం వర్కింగ్ గ్రూప్‌లో భాగంగా రూపొందించబడింది.