SRCL: కవియిత్రి మొల్లమాంబ సేవలు మరువలేనివని కుమ్మర యువజన సంఘం అధ్యక్షుడు ఐలపురం హరీష్ అన్నారు. ముస్తాబాద్‌లో మొల్లమాంబ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. కవిత్వంలో కవియిత్రి మొల్ల మాంబా చేసిన సేవలు ఎన్నడు మరువలేనివని కొనియాడారు. ఉపాధ్యక్షుడు ఎదునూరి సతీష్,సలహాదారులు భానుచందర్, సంతోష్, అశోక్ ఉన్నారు.