»Hero Sudhakar Komakula Exclusive Interview Narayana Co Movie
Sudhakar Komakula: చిరంజీవిని కలిసినప్పుడు ఆ డైలాగ్ చెప్పాను
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నటుడు సుధాకర్ కోమాకుల(Sudhakar Komakula) మెగాస్టార్ చిరంజీవిని కలిశానని హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు బలగం చిత్రానికి మ్యూజిక్ అందించిన డైరెక్టర్ కూడా నారాయణ అండ్ కో చిత్రానికి సంగీతం అందించినట్లు చెప్పారు. దీంతోపాటు అనేక విషయాలను పంచుకున్నారు.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012) చిత్రంతో టాలీవుడ్ సినిమాల్లో అరంగేట్రం చేసిన నటుడు సుధాకర్ కోమాకుల(Sudhakar Komakula). ఆ తర్వాత సుధాకర్ కుందనపు బొమ్మ (2016), నువ్వు తోపు రా (2019) వంటి చిత్రాల్లో యాక్ట్ చేశాడు. ఇటీవల సుధాకర్ నారాయణ అండ్ కో(Narayana & Co Movie) చిత్రంలో నటించగా..ఈ మూవీ జూన్30న విడుదలైంది. ఈ సందర్భంగా హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ నటుడు కీలక విషయాలను పంచుకున్నాడు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
అందరికీ నచ్చే విధంగా సినిమాలు చేయాలనేదే తన కోరిక అని సుధాకర్ పేర్కొన్నాడు. టీవీలో లేదా థియేటర్లో చూసినా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనేదే తన ఉద్దేశమని వెల్లడించారు. నారాయణ అండ్ కో చిత్రం ఫన్ చిత్రమని తెలిపారు. పది మంది చక్కగా వెళ్లి చూసే చిత్రమని అన్నారు. ఈ సినిమా కథను గంటన్నర విన్న తర్వాత చేసేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. అన్ని తెలుసు అనుకునే అమాయకులు క్రైం చేస్తే ఎలా ఉంటుంది. అనేది ఈ సినిమాలో ఫన్నీగా చూపించడం జరిగిందన్నారు. ఈ చిత్రంలో ఫైట్స్ కూడా ఎక్కువగా ఉండవు. ఇలాంటి క్యారెక్టర్ కూడా సుధాకర్ చేయగలడని నిరూపించుకునేందుకు తాను ఈ చిత్రాన్ని ఎంచుకున్నట్లు ఈ నటుడు పేర్కొన్నారు. ఈ చిత్రంలో పెద్ద కుమారుడికి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని అనుకుంటారని…దీంతోపాటు ఈ సినిమా ఎక్కువగా జనాల్లోకి వెళితే పార్ట్ 2 కూడా తీసే అవకాశం ఉందని వెల్లడించారు. ఒకనొక క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని కలిసినప్పుడు ఓ డైలాగ్ చెప్పానని అన్నారు.