NZB: బోధన్ పట్టణంలోని దీపక్ స్వీట్ హోమ్‌పై సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.హోటల్లో నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగ (డొమెస్టిక్) సిలిండర్లు వాడుతుండటంతో 15 సిలిండర్లను సీజ్ చేసి, యజమాని మహావీర్‌పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీటీ పవన్ మాట్లాడుతూ.. గృహ అవసరాల సిలిండర్లను వాణిజ్య పరంగా ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.