RR: కొండాపూర్‌లోని స్టెప్‌వెల్ పార్క్ పనులను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన పరిశీలించారు. కొండాపూర్‌లోని మాధవ హిల్స్ ఫేజ్-1 వద్ద పార్క్ పనులను పరిశీలించిన అనంతరం అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌తో పాటు అధికారులకు ఆదేశించారు.