హైదరాబాద్ కు నగరానికి చెందిన టెక్నో పెయింట్స్(Techno paints) బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటుడు మహేష్ బాబు ప్రచారం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో మహేష్ రెండేళ్ల పాటు ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారు.
టెక్నో పెయింట్స్(Techno paints) బ్రాండ్ అంబాసిడర్‌గా రెండు సంవత్సరాల పాటు టాలీవుడ్ నటుడు మహేష్ బాబు(Mahesh Babu)ను నియమించుకున్నట్లు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా అందుకు సంబంధించిన యాడ్ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. వీడియోలో మహేష్ ఇంకా యంగ్ యువకుడి మాదిరిగా బ్లూకలర్ టీషర్ట్ వేసుకుని కనిపిస్తున్నారు. దీంతోపాటు మహేష్ హెయిర్ స్టైల్ కూడా ఈ ప్రకటనలో కొత్తగా ఉంది. ఆ క్రమంలో సుబ్బారావు టీపీ ఉందిగా ఎందుకు టెన్షన్ అంటూ తన దైన శైలిలో డైలాగ్స్ చెబుతూ ఈ యాడ్ లో కూడా సూపర్ స్టార్ మహేష్ అదరగొట్టారు.
యూత్ ఐకాన్‌గా ప్రిన్స్ మహేష్ బాబు తమ సంస్థ ఇమేజ్ ను మరింత మందికి విస్తరించడానికి సహాయపడుతుందని టెక్నో పెయింట్స్(Techno paints) బ్రాండ్ గ్రూప్ వ్యవస్థాపకులు ఆకూరి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇండియా రిటైల్ పెయింట్స్ మార్కెట్లో మరింత స్థిరపడగలమని నమ్మకంగా ఉన్నామని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో(telugu states) రూ.12,000 కోట్ల పెయింట్స్ పరిశ్రమలో 25 శాతం మార్కెట్ వాటాను లక్ష్యంగా చేసుకున్నామని ఆయన అన్నారు. దీనిని 12 నుంచి 18 నెలల్లో ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ ఉత్పత్తులు 5,000 టచ్ పాయింట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. తాము ఇప్పటికే 2,000 షేడ్స్ పెయింట్స్ తయారు చేస్తున్నామని అన్నారు. కస్టమర్లు కోరుకునే రంగులను వెంటనే సరఫరా చేయడానికి తాను అనేక రకాల కలర్ బ్యాంక్‌లను ప్రవేశపెట్టామని చెప్పారు. MNCలు మాత్రమే ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయని గుర్తు చేశారు.