MDK: మనోహరాబాద్ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు దిగే ప్రయత్నంలో మధ్య ప్రదేశ్ వాసి తీవ్రంగా గాయపడ్డాడు. రామాయంపేటలోని ఓ కంపెనీలో పనిచేసే బిహారీ లాల్ (50), గురువారం రాత్రి మనోహరాబాద్ స్టేషన్లో దిగుతుండగా ప్లాట్‌ఫారమ్, రైలు మధ్య ఇరుక్కుపోకి కుడి కాలు తెగింది. గమనించిన స్థానికులు అతడిని తూప్రాన్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.