ATP: జిల్లాలో కమర్షియల్ వంట గ్యాస్ కొరత కారణంగా కట్టెలకు డిమాండ్ పెరిగింది. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు ప్రత్యామ్నాయంగా కట్టె పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. గతంలో క్వింటా కట్టెలు రూ.800 నుంచి రూ.1000 వరకు ఉండగా, ప్రస్తుతం వీటి ధర రూ.1500కు పైగా పలుకుతోంది.