నెల్లూరు నగరంలో విద్యుత్ కష్టాల పరిష్కారానికి గాంధీ పార్క్ వద్ద రూ.5 కోట్లతో 11కేవీ కంటైనర్ సబ్స్టేషన్ పనులు ప్రారంభించారు. గతేడాది డిసెంబర్ నాటికే పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు, ప్రస్తుతం బేస్మెంట్ దశలోనే ఉంది. వేసవి రావడంతో విద్యుత్ అంతరాయంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పనులు త్వరగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.