HYD: గ్యాస్ కొరత నగరవాసుల జేబు ఖాళీ చేస్తోందని పలువురు వాపోతున్నారు. నిజాంపేట్‌లోని ఓ హోటల్ వద్ద ‘గ్యాస్ సిలిండర్ షార్టేజ్ అన్ని ఐటమ్స్ మీద రూ.20 అదనం’ అని రాసిన ఉన్న ఫొటో SMలో వైరల్ అవుతోంది. రూ.40 ఉండే టిఫిన్‌పై పెంచిన ధర 50% కావడం గమనార్హం. నగరవ్యాప్తంగా చాయ్ మీద రూ.5 పెంచినట్లు నిర్వాహకుల చెబుతుండటం ధరల పెరుగుదల తీవ్రతను తెలియజేస్తోంది.