Padi kaushik Reddy: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై పాడి కౌశిక్ రెడ్డి (Padi kaushik Reddy) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆయన ఏ గిమ్మిక్కు చేసినా.. వచ్చే ఎన్నికల్లో జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం అని చెప్పారు. అసలు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియదని.. బీజేపీ అంటారని, అప్పుడే కాంగ్రెస్ నేతలతో కలువడంతో ఆ పార్టీలో చేరతారనే సందేహాం కలుగుతుందన్నారు. ఓ సారి బీఆర్ఎస్ నేతలను మీట్ అవుతారని పేర్కొన్నారు. ఎందుకు ఆగం ఆగం అవుతున్నారని మండిపడ్డారు. ఈటల రాజేందర్ బిత్తిరి బిత్తిరి అవుతున్నారని.. అయినప్పటికీ జనం నుంచి సానుభూతి రాదన్నారు. హుజురాబాద్ ప్రజలు సానుభూతి చూపరని స్పష్టంచేశారు.
ఏడున్నరేళ్లు మంత్రిగా చేసి హుజురాబాద్ నియోజకవర్గానికి ఈటల రాజేందర్ ఏమీ చేయలేదని పాడి కౌశిక్ రెడ్డి (Padi kaushik Reddy) అన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చేసింది సున్నా అన్నారు. తాను ప్రభుత్వ విప్ అయిన తర్వాత బోర్నపల్లిలో ముదిరాజ్‌ల కోసం పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మించానని గుర్తుచేశారు. ఈటల సొంత ఊరు కమలాపూర్‌లో రూ.30 లక్షలతో అమ్మవారి ఆలయం కట్టించానని తెలిపారు. ఇల్లంతకుంటలో గల శ్రీరాముల గ్రామం, జమ్మికుంట, ధర్మారంలో ఆలయాలు నిర్మించానని తెలిపారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి అండగా ఉన్నానని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. 106 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపాలిటీల్లో ముదిరాజ్‌ల ఉన్నతికి పాట పడుతున్నానని వివరించారు.