BHPL: వేసవి కాలంలో రైతులకు సాగునీటి కొరత లేకుండా చెరువులు, కుంటలు, ప్రాజెక్టు కాలువల ద్వారా నీరు సమృద్ధిగా అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు సూచించారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.