ప్రకాశం: మార్కాపురం రైల్వే స్టేషన్ సమీపంలోని మహమ్మద్ నగర్లో గురువారం రాత్రి ఓ ఇంట్లోకి నాగుపాము దూరింది. బుసలు కొడుతున్న నాగుపామును చూసి కుటుంబీకులు భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్ నిరంజన్ కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిగా వచ్చి నాగుపామును చాకచక్యంగా పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.