JGL: కోరుట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ఎంఈవో గంగుల నరేశం సమావేశమయ్యారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షలు ఉన్నందున, మధ్యలో వచ్చే సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ, పోషకాహారం తీసుకోవాలని సూచించారు.