అక్కినేని నాగచైతన్య తన వంట గది ముచ్చట్లను సరదాగా పంచుకున్నాడు. ఖాళీ దొరికితే కొత్త వంటకాలను ప్రయత్నిస్తుంటానని అన్నాడు. తాను చేసిన వంటలకు తన భార్య శోభిత ఇచ్చే ఫీడ్బ్యాకే ఫైనల్ అని తెలిపాడు. ఇక తన తండ్రి నాగార్జున డైట్ పక్కన పెట్టి మరీ ఆదివారం ‘స్కూజీ’ పిజ్జాలను ఇష్టంగా తింటారని వెల్లడించాడు.