మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్ దిల్ రాజు మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ నెల 19న నిర్వహించనున్న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి చిరంజీవిని ఆహ్వానించారు. కాగా, ఇటీవల చిరంజీవి ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దిల్ రాజు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.