సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలో ప్రతి గురువారం నిర్వహించే వారపు సంతలో మార్పు చేశారు. వచ్చే గురువారం ఉగాది పండుగ సందర్భంగా వారపు సంతను బుధవారం నిర్వహిస్తున్నట్లు సంత గుత్తేదారు హరికృష్ణ తెలిపారు. ప్రజలు, వ్యాపారస్తులు, రైతులు ఈ మార్పును గమనించి బుధవారం జరిగే సంతలో తమ వ్యాపారాలను నిర్వహించాలని ఆయన సూచించారు. సంతకు వచ్చే వారంతా సహకరించాలని కోరారు.