MDK: తూప్రాన్ పట్టణ పరిధి కరీంగూడకు చెందిన గోగుల లక్ష్మి (45) నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పనులకు వెళ్లిన కొడుకు మూడు రోజులుగా ఇంటికి రాకపోవడంతో బుధవారం రాత్రి వెతికేందుకు వెళ్ళింది. ఈ క్రమంలో ఆమె అల్లాపూర్ శివారు బండమీది గుంత నీటిలో మునిగి చనిపోయింది. ఆలస్యంగా గురువారం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.