»Project K Movie Title Launch In America Do You Know When
Project K: అమెరికాలో టైటిల్ లాంచ్..ఎప్పుడో తెలుసా?
మూడు నెలల గ్యాప్‌తో మూడు సినిమాలతో బాక్సాఫీస్ కింగ్‌గా ప్రభాస్ నిలవబోతున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్‌తో ఫామ్‌లోకి వచ్చేశాడు డార్లింగ్. ప్రస్తుతం ఆదిపురుష్ థియేటర్లో సక్సెఫుల్‌గా రన్ అవుతోంది. వారం రోజుల్లో 400 కోట్లకు పైగా రాబట్టింది. ఇక ఆదిపురుష్ మ్యానియా మెల్లిగా తగ్గిపోతోంది కాబట్టి.. నెక్స్ట్ సలార్, ప్రాజెక్ట్ కె(Project K) టైం స్టార్ట్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ కె టైటిల్ లాంచ్‌కు భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్.. సెప్టెంబర్ 28న రిలీజ్‌కు షెడ్యూల్ చేశారు. రిలీజ్‌కు ఇంకో మూడు నెలల సమయం మాత్రంమే ఉంది. ఈ క్రమంలో జులైలో ఫస్ట్ వీక్‌లో టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక సంక్రాంతికి ప్రాజెక్ట్ కె రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె(Project K) పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా రాబోతోంది. వైజయంతీ మూవీస్ వారు దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రాజెక్ట్ కెని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్(first look) కూడ రివీల్ చేయలేదు. జస్ట్ హ్యాండ్ పోస్టర్స్, స్క్రాచ్ వీడియోలు మాత్రమే రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమా టైటిల్ ఏంటనేది.. ఆసక్తికరంగా మారింది. ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు.. ఇదే టైటిల్‌గా ఫిక్స్ అయిపోయారు ఆడియెన్స్. కానీ త్వరలోనే ఒరిజినల్ టైటిల్ అనౌన్స్మెంట్కు భారీగా ఎత్తున ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. జూలై సెకండ్ వీక్‌లో ప్రాజెక్ట్ కె టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.
టైటిల్‌తో పాటు ప్రభాస్(prabhas) ఫస్ట్ లుక్‌ను కూడా ఆ మోషన్ పోస్టర్లో రివీల్ చేయబోతున్నారట. అయితే ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో వస్తోంది కాబట్టి..అదే రేంజ్లో ప్రమోషన్స్‌కు ప్లానింగ్ చేస్తున్నారు. అందుకే టైటిల్ మోషన్ పోస్టర్ని అమెరికాలో గ్రాండ్‌గా విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. ఇదే నిజమైతే..ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ డోస్ అని చెప్పొచ్చు.