ధమాకాతో వంద కోట్ల కొల్లగొట్టిన మాస్ మహారాజా రవితేజ(raviteja).. ఆ వెంటనే మెగాస్టార్‌తో కలిసి వాల్తరు వీరయ్య భారీ విజయాన్ని అందుకున్నాడు. కానీ ఆ తర్వాత నెగెటివ్ టచ్‌తో వచ్చిన 'రావణాసుర' మాత్రం బాగా డిసప్పాయింట్ చేసింది. అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో మాత్రం పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఆ తర్వాత ఈగల్‌గా రాబోతున్నాడు రవితేజ. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈగల్‌గా ఎటాక్ చేస్తున్నాడట రవితేజ.
వచ్చే దసరా సందర్భంగా ‘టైగర్ నాగేశ్వర్ రావు’ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్టువర్ట్పురంలో గజ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ ఆధారంగా.. టైగర్ నాగేశ్వర రావు తెరకెక్కుతుంది. వంశీ డైరెక్షన్లో రవితేజ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో.. టైగర్ నాగేశ్వర రావు పై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ఈగల్(Eagle)గా ఎటాక్ చేయబోతున్నాడు మాస్ రాజా. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈగల్ మూవీని.. సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా షెడ్యూల్ చేసుకున్నారు. ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, మహేష్ బాబు ‘గుంటూరు కారం’తో పోటీకి రెడీ అవుతోంది ఈగల్.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్(shooting) శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేస్తున్నారట. జులై 4వరకు ఈ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌తో ఈగల్ షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టేనని సమాచారం. అయితే ఈ షెడ్యూల్లో కొన్ని హై ఎలిమెంట్స్ సీన్స్ తెరకెక్కిస్తున్నారట. సినిమాలో ఈ యాక్షన్ బ్లాక్ హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. అంతేకాదు రవితేజ ఈగల్ ఎటాక్ మామూలుగా ఉండదని అంటున్నారు.
ఈగల్‌గా రవితేజ(raviteja) అప్పియరెన్స్ అద్భుతంగా ఉంటుందట. ఖచ్చితంగా ఈ సినిమా మాస్ రాజ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు. రవితేజను తన అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో.. అలా చూపించబోతున్నాడట కార్తీక్ ఘట్టమనేని. దాంతో ఈగల్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా.. కావ్య థాపర్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. మరి రవితేజ బాక్సాఫీస్ ఈగల్ ఎటాక్ ఎలా ఉంటుందో చూడాలి.