Adipurush: ‘ఆదిపురుష్’ని బ్యాన్ చేయండి.. సీఎం డిమాండ్
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్(Adipurush) సినిమా..ఆది నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన సమయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తపరిచారు. రామయాణాన్ని వక్రీకరిస్తున్నారంటూ మండి పడ్డారు కొందరు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఆదిపురుష్‌ని బ్యాన్(ban) చేయాలంటు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా చత్తీస్ ఘడ్ సీఎం కూడా ఆదిపురుష్‌ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడం వైరల్‌గా మారింది.
ఆదిపురుష్(Adipurush) ట్రైలర్ వచ్చాక నెగెటివిటీ కాస్త తగ్గినా.. సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం మళ్లీ ఆదిపురుష్ పై కొత్త వివాదాలు మొదలయ్యాయి. అయినా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. ఫస్ట్ వీక్‌లో 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయినా కూడా ఆదిపురుష్‌పై వివాదాలు నడుస్తునే ఉన్నాయి. నేపాల్‌లో సీత డైలాగ్ కట్ చేయాలని, హనుమాన్ డైలాగ్స్ మార్చాలని, ఆదిపురుష్‌ని బ్యాన్ చేయాలని విమర్శలు వస్తునే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు, వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ఈ సినిమాను నిషేధించాలని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్(Bhupesh Baghel) డిమాండ్ చేశారు. అంతేకాదు..కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రిక్వెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్‌తో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆదిపురుష్ సినిమా వివాదం చర్చకు వచ్చినట్టు తెలుస్తోది. ఈ సినిమాలో కొన్ని పాత్రల చిత్రీకరణ, వివాదాస్పద డైలాగ్స్ పై సీఎం అభ్యంతరాన్ని వ్యక్తం చేశారట.
అంతేకాదు.. భూపేష్ భాఘేల్ ట్వీట్ చేస్తూ.. ఛత్తీస్‌గఢ్ ప్రజలు, రామభక్తులు అమిత్ షాకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఇదే సమయంలో ఆదిపురుష్ సినిమాను నిషేధించాలని కోరుతున్నాను. రామాయణం ప్రతిష్టకు భంగం కలుగకముందే ఈ నిర్ణయం తీసుకోవాలంటూ.. ట్వీట్ చేశారు. దీంతో ఆదిపురుష్(Adipurush) బ్యాన్(ban) వ్వవహారం మరింత వేడెక్కినట్టైంది. అయితే ఒక్క చత్తీస్ ఘడ్ సీఎం మాత్రమే కాదు.. ఇంకొన్ని రాష్ట్రాల్లోను ఆదిపురుష్ వివాదం నడుస్తోది. ఏదేమైనా.. ప్రస్తుతం ఆదిపురుష్ వివాదాలు కేంద్ర బిందువుగా మారిందని చెప్పొచ్చు.