CTR: గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిందని, ధరలు భారీగా పెరిగాయని నిరాధార వార్తలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. వాస్తవాలు నిర్ధారించకుండా తప్పుడు సమాచారాన్ని పోస్టు చేయడం, షేర్ చేయడం కూడా నేరమని తెలిపారు. ప్రజలు అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని ఎస్పీ సూచించారు.