అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ, అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పరిటాల శ్రీరామ్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు, ముందస్తు నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.