ELR: కైకలూరు ప్రధాన సెంటర్లో గురువారం వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు వైసీపీ జెండాను ఆవిష్కరించి వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. 15వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్న పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.