CTR: APSSDC ఆధ్వర్యంలో ఈనెల 17న నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ తెలిపారు. ఈ మేళాకు 20కి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరై దాదాపు 1,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. 10Th, ఐటీఐ, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు అర్హులని తెలిపారు.