KDP: ఈనెల 13న యోగి వేమన విశ్వవిద్యాలయం 11, 12, 13, 14వ స్నాతకోత్సవాలు డీ.ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఛాన్సలర్ హోదాలో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ఏర్పాట్లను పరిశీలించారు. జేసీ వెంట రాజంపేట సబ్ కలెక్టర్ భావన తదితరులు పాల్గొన్నారు.