బెంగాలీ వృద్ద దంపతుల వీడియో (Viral Video) నెట్టింట ప్రస్తుతం తెగ వైరలవుతోంది. కూరగాయలను వేరు చేస్తూ బిజీగా ఉన్న భార్యను పెద్దాయన సరదాగా తన చేతికర్రతో తడుముతుండటం కనిపిస్తుంది. ఈ వీడియోను కోల్‌కతా (Kolkata) చిత్రోగ్రఫీ అనే ఖాతా ఇన్స్టాగ్రాం(Instagram)లో షేర్ చేసింది. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏకంగా 4 లక్షల మందికి పైగా చూశారు. డైనింగ్ టేబుల్ (Dining table) వద్ద కూర్చున్న వృద్ధ జంట తమ వ్యవహార శైలితో చూపరులను ఆకట్టుకున్నారు.
పెద్దావిడను ఆమె భర్త సరదాగా ఆటపట్టిస్తుంటే ఆమె చిరాకు పడుతుండటం ఈ క్లిప్‌లో చూడొచ్చు.భార్యను పనినుంచి మళ్లించేందుకు పెద్దాయన అన్ని ప్రయత్నాలూ చేస్తాడు. ఈ వీడియోపై నెటిజన్ల (Netizens) నుంచి అనూహ్య స్పందన లభించింది. ప్రేమకు వయసు, సమయం, వివాదం, వినోదం అంటూ తేడా ఏమీ ఉండదని ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకరి పట్ల మరొకరు ప్రేమను కనబరచవచ్చని ఓ యూజర్ కామెంట్ చేయగా, బ్యూటిఫుల్ (Beautiful) వీడియో అని మరో యూజర్ రాసుకొచ్చారు.