GDWL: ముక్కుపుటలు అదిరే కంపు, అడుగుతీసి అడుగు వేయలేని చెత్తాచెదారం, ఇదేనా మాకు మీరు అందించే ప్రజా పాలన. రోడ్ల నిండా మురుగు నిలిచి నరకం కనిపిస్తుంటే పట్టించుకునే నాథుడే లేడు అని గద్వాల పట్టణంలోని 10, 11, 12 వార్డుల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం 99 రోజుల ప్రగతి ప్రణాళికను ప్రారంభించిన ప్రకటనలకే పరిమితమైందన్నారు.