తిరుమల(Tirumala)లో టీటీడీ(TTD) పాలక మండలి సమావేశమైంది. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి 4.17 కోట్ల రూపాయలతో టెండర్లను ఆమోదిస్తున్నట్లు వెల్లడించారు. 2.35 కోట్ల రూపాయలతో హెచ్వీసీ కాటేజీలను ఆధునీకరించేందుకు ఆమోదం తెలిపారు. తిరుమలలో 40.50 కోట్ల రూపాయలతో వేస్ట్ మేనేజమెంట్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు పాలక మండలి తెలిపింది.
శ్రీవాణి ట్రస్ట్ (Srivani Trust)పై వస్తున్న పలు ఆరోపణలు ఖండిస్తున్నామని టీటీడీ(TTD) పాలక మండలి తెలిపింది. దీనిపై బోర్డులో సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొంది. రాష్ట్రంలోని 25 జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో 2,445 ఆలయాల నిర్మాణానికి నిధులు ఖర్చు పెడుతున్నట్లు పాలక మండలి వెల్లడించింది. శ్రీవాణి ట్రస్ట్ విరాళాల ఖర్చుపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు తెలిపింది.
టీటీడీ పాలక మండలి తీసుకున్న కీలక నిర్ణయాలివే: తిరుమలలో డస్ట్ బిన్ల కోసం 3.10 కోట్ల రూపాయలతో స్టీల్ సాండ్ల ఏర్పాటు టీటీడీ కంప్యూటర్ల ఆధునికీకరణకు 7.44 కోట్ల రూపాయలు కేటాయింపు స్విమ్స్ ఆధునికీకరణకు 1200 బెడ్స్ ఉండే విధంగా రూ.97 కోట్లతో అవసరమైన భవనాలు నిర్మించాలని నిర్ణయం ఎయిమ్స్ తరహాలో తిరుచానూరు పుష్కరిణికి ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటు ఒంటిమిట్ట ఆలయం వద్ద 4 కోట్ల రూపాయలతో అన్నదాన భవనం ఏర్పాటు