NLG: చిట్యాల మండలం వెంబావి గ్రామంలో ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా గురువారం వాటర్ ట్యాంకులను శుభ్రం చేసి, క్లోరినేషన్ నిర్వహించారు. సర్పంచ్ అలివేలు వెంకన్న ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, సిబ్బంది ట్యాంకుల పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామస్తులకు సురక్షితమైన, పరిశుభ్రమైన తాగునీటిని అందించడమే లక్ష్యమని అన్నారు.