KNR: డ్రగ్స్, గంజాయి, ఆన్ లైన్ బెట్టింగ్ వంటి అలవాట్లు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, అడిషనల్ డీసీపీ వేంకటరమణ తెలిపారు. డివైఎఫ్ఎ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యువతలో అవగాహన కల్పించేందుకు విడుదల చేసిన కరపత్రాన్ని వారు KNRలో ఆవిష్కరించారు. మత్తు పదార్థాలు, బెట్టింగ్లకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు.