నిర్మల్: ఖానాపూర్ మండలం బావాపూర్ గ్రామంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. అమూల్య (18) అనే యువతి ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆమెకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. అనారోగ్య సమస్యతో మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.