రిఫ్రిజిరేటర్ చుట్టూ తగినంత గాలి ఆడేలా ఖాళీ ఉంచాలి. గోడకు ఆనించి ఉంచితే గాలి వెలుతురు లేక కంప్రెసర్ త్వరగా వేడెక్కుతుంది. దీనివల్ల విద్యుత్ బిల్లు పెరగడమే కాకుండా ఫ్రిజ్ పనితీరు, మన్నిక కూడా తగ్గుతుంది. అందుకే ఫ్రిజ్ పైన, వెనుక, పక్కల కనీసం అంగుళం మేర ఖాళీ వదలడం చాలా అవసరం.